Page Loader
Ranbir Kapoor: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌పై ఫిర్యాదు.. ఎందుకంటే…
Ranbir Kapoor: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌పై ఫిర్యాదు.. ఎందుకంటే…

Ranbir Kapoor: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌పై ఫిర్యాదు.. ఎందుకంటే…

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 28, 2023
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రిస్టమస్ సెలబ్రేషన్ వీడియోలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్,అతని కుటుంబ సభ్యులపై ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. సంజయ్ తివారీ తన లాయర్లు ఆశిష్ రాయ్,పంకజ్ మిశ్రా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్,ఆయన కుటుంబసభ్యులు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో జహాన్ కపూర్ కేక్ పై మద్యాన్ని పోసి నిప్పంటించాడు. అది అయ్యాక రణబీర్ కపూర్ కేక్ వెలిగించి, 'జై మాతా ది' అని చెప్పాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Details 

రణబీర్ కపూర్‌పై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు 

హిందూ మతంలో, ఇతర దేవతలను పిలిచే ముందు అగ్ని దేవుణ్ణి ఆరాధిస్తారు. అయితే కపూర్, అతని కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగా మరొక మతం పండుగను జరుపుకునేటప్పుడు మత్తు పదార్థాలను ఉపయోగించారు. అంతేకాకుండా "జై మాతా ది" అని నినాదాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వార్తా సంస్థ PTI నివేదించింది. రణబీర్ కపూర్‌పై సెక్షన్ 295 A, 298, 500 (పరువు నష్టం), 34 సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు.