రజనీకాంత్ జైలర్ ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసినవాళ్ళు ఏమంటున్నారంటే?
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసారు. ఆఖరుకు జైలర్ ఈరోజు విడుదలైంది. ఆల్రెడీ ప్రీమియర్స్ పడిపోవడంతో టాక్ బయటకు వచ్చింది. ఇంతకీ జైలర్ పై నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం. జైలర్ సినిమా ఫస్టాఫ్ లో రజనీకాంత్ స్టయిల్ చాలా బాగుందని అంటున్నారు. పాత రజనీకాంత్ కనిపిస్తాడని చెబుతున్నారు. ఇంటర్వెల్ సమయంలో వచ్చే సీన్ రజనీకాంత్ అభిమానులను ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్ వేరే లెవెల్లో ఉందని, ఈ వయసులోనూ తెరమీద రజనీకాంత్ కనిపించిన తీరు అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
జైలర్ సినిమా బలహీనతలు పంచుకున్న నెటిజన్లు
అయితే కొన్నిచోట్ల డార్క్ కామెడీ ఉందని, అది కొందరికి వర్కౌట్ అయినట్లు , మరికొందరికి అంతగా కనెక్ట్ కాలేనట్టు చెబుతున్నారు. ఎక్కువశాతం నెటిజన్లు జైలర్ సినిమాపై పాజిటివ్ గా రివ్యూలు ఇస్తున్నారు. కొంతమంది మాత్రం స్క్రీన్ ప్లే వీక్ గా ఉందని, కామెడీ వర్కౌట్ కాలేదని అంటున్నారు. అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం వేరే లెవెల్ లో ఉందని ప్రతీ ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి జైలర్ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. జైలర్ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ తెరకెక్కించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.