జైలర్ విలన్ వినాయక్ ను అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
రజనీకాంత్ బ్లాక్ బస్టర్ 'జైలర్' సినిమాలో విలన్ గా నటించిన వినాయక్ అరెస్ట్ అయ్యారు.
ఈ మేరకు ఏకంగా పోలీస్ అధికారులు, సిబ్బందిపైనే దాడి చేస్తూ వివాదాస్పదంగా ప్రవర్తించారు. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జైలర్ సినిమాలో ప్రేక్షకుల ప్రశంసలు పొందిన నటుడు, విలన్ వినాయకన్‌ను కేరళ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
గత ఆగస్టులో జైలర్ విడుదలై బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. ఈ మేరకు చిత్రంలో మలయాళ నటుడు వినాయకన్ విలన్‌గా నటించారు.
ఈ చిత్రంలో చేసిన నటనకు గానూ వినాయకన్, సినీ ప్రముఖులు, ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్నారు.ఈ క్రమంలోనే చిత్రసీమలో తనదైన శైలిలో పేరు తెచ్చుకున్నారు.
మరోవైపు కేరళ చిత్రపరిశ్రమ, మాలీవుడ్ లో వినాయకన్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్.
details
చాలా మంది మహిళలతో పరిచయం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వినాయకన్
గతంలో ఓసారి, తనకు చాలా మంది మహిళలతో పరిచయం ఉందని స్వయంగా వినాయకన్ ఒకసారి వేదికపై చెప్పడం సంచలనాత్మకమైంది.
ఇప్పుడు తాజాగా పోలీసులతో ప్రవర్తించిన తీరుతో మరోసారి కేరళలో వివాదాస్పదమయ్యారు.
అసలేం జరిగిందో తెలుసా..
మద్యం మత్తులో ఉన్న వినాయకన్, ఎర్నాకుళం నార్త్ ఠాణాలోకి వెళ్లాడు. అనంతరం అక్కడి అధికారిపై దాడి చేశాడు.
అంతటితో ఆగకుండా వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఎర్నాకుళం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసు స్టేషన్‌లో, పోలీసుల విధులకు అంతరాయం కలిగించిన కారణం మీద అతన్ని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు.
మరోవైపు వినాయకన్ మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారించేందుకు ఆస్పత్రికి తరలించారు.