Page Loader
రజినీ ఫ్యాన్స్ కు పూనకాలే.. తలైవా, దళపతి కాంబోతో  జైలర్-2 
తలైవా, దళపతి కాంబోకు దిలీప్ కుమార్ ప్లాన్

రజినీ ఫ్యాన్స్ కు పూనకాలే.. తలైవా, దళపతి కాంబోతో  జైలర్-2 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 14, 2023
07:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ దళపతి ప్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ అందనుంది.ఈ మేరకు విజయ్, రజినీ మల్టీస్టారర్ కాంబోలో భారీ సినిమాను తెరకెక్కించే యోచనలో జైలర్ దర్శకుడు దిలీప్ కుమార్ ఉన్నట్లు సమాచారం. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పినట్లు తెలుస్తోంది. మల్టీస్టారర్ చిత్రానికి తనవంతుగా కృషి చేస్తున్నట్లు పరిశ్రమవర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు జైలర్ 2 కూడా ఉండబోతున్నట్లు తెలిసింది. ఫ్లాప్ సినిమాలతో సతమతమైన దిలీప్ ఇకపై భారీ సినిమాలతో రానున్నారు. ప్రస్తుతం 'జైలర్' సినిమాతో ప్రేక్షకులకు నెల్సన్ దిలీప్ కుమార్ ఊహించని బ్లాక్ బస్టర్ అందించారు. ఈ మేరకు ఆయన్ను రజినీ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కేవలం 4 రోజుల్లోనే రూ.300 కోట్లు సాధించడం విశేషం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తలైవా, దళపతి కాంబోతో  జైలర్-2