
Janhvi Kapoor: మద్యం మత్తులో ఆక్సిడెంట్ చేసిన మహిళ.. అసహనం వ్యక్తం చేసిన జాన్వీ కపూర్
ఈ వార్తాకథనం ఏంటి
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించింది.
'దేవర' అనే భారీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, ఆ సినిమా విజయంతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను దక్కించుకుంది.
నటనతో ఆకట్టుకున్న ఈ భామ వరుసగా అవకాశాలు అందుకుంటూ, గ్యాప్ లేకుండా చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
ప్రస్తుతం జాన్వీ కపూర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి 'పెద్ది' అనే చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో జగపతి బాబు,కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్,బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
వివరాలు
మద్యం సేవించి కారును నడిపిన మహిళ
ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా, జాన్వీ మరోవైపు 'పరమ్ సుందరి' అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది.
షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా, ఆమె సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటుంది.
తాజాగా ఓ సంఘటనపై ఆమె స్పందనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
వివరాల్లోకెళితే, మద్యం సేవించి కారును నడిపిన ఓ మహిళ, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఓ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసిన జాన్వీ
ఈ ఘటనపై జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, "ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తనకు సమర్థనమేదైనా ఉంటుందా? మద్యం తాగి వాహనం నడపడం వల్ల చుట్టుపక్కల వారికి ప్రమాదాన్ని కలిగించడం ఎంత తప్పు అనే విషయాన్ని ఎవ్వరైనా గుర్తించరా? ఈ ప్రమాద వివరాలు తెలిసి నాకు ఎంతో బాధ వేసింది. మద్యం కారణంగా జరిగే ప్రమాదాల్లో ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి. ఎంతో మంది గాయపడుతున్నారు. మనం చట్టాలను ఎందుకు గౌరవించలేకపోతున్నాం? కనీస అవగాహన లేకుండా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం?" అంటూ భావోద్వేగంగా రాసింది.
అంతేకాకుండా, ఆ సంఘటనకు సంబంధించిన వీడియోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.