Janhvi Kapoor: అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేయనున్న జాన్వీ కపూర్..!
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ కి గతేడాది బాగానే కలిసి వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.
ఈ చిత్రం రూ.2 వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. పుష్ప తరువాత బన్నీ తదుపరి సినిమాగా ఏమి చేస్తాడనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ, ఈ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని, దీన్ని పక్కన పెట్టి బన్నీ తమిళ ప్రముఖ దర్శకుడు అట్లీతో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
'దేవర' సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ
చాలారోజులుగా అట్లీ, బన్నీ కాంబోలో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ చిత్రంలో హై యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని చెబుతున్నారు.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్ వివరాలు ప్రకటించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా, అల్లు అర్జున్‌తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ అంశంపై అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ, జాన్వీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని వార్తలు వచ్చాయి.
దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా, రెండో భాగంలో జాన్వీ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
వివరాలు
బాలీవుడ్‌లో 'పరమ సుందరి'
ప్రస్తుతం తెలుగులో 'ఉప్పెన' సినిమాతో పాపులర్ అయిన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాక, నాని హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో జాన్వీ కపూర్ తీసుకున్నారని వార్తలు వచ్చినా, అవి అబద్ధమైనవని తేలింది.
తాజాగా, అల్లు అర్జున్, అట్లీ సినిమాల్లో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తే, ఇది ఆమె తెలుగు చిత్రాలలో మూడో చిత్రం అవుతుంది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో 'పరమ సుందరి' చిత్రంలో నటిస్తోంది.
ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా కనిపించనున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది జూలైలో విడుదల కానుంది. తుషార్ జలోటా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.