
Jani Master: రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ విచారణ.. నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌ను గోవా నుండి శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
ప్రస్తుతం ఆయన్ని ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. విచారణ ముగిసిన తర్వాత, జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.
తనపై ఆరోపణలు వచ్చినప్పటి నుండి జానీ మాస్టర్ తప్పించుకొని తిరుగుతున్నఆయనను , గురువారం గోవాలో అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు.
ఆయన్ని అక్కడి స్థానిక కోర్టులో హాజరుపరచి, పీటీ వారెంట్ ఆధారంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
వివరాలు
నా భర్త తప్పు చేసినట్లయితే.. ఆయనను వదిలేస్తా: ఆయేషా
ఇదిలా ఉంటే, జానీ మాస్టర్ భార్య ఆయేషా మాట్లాడుతూ, తన భర్తను రాజకీయ కుట్రలో భాగంగా ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
తన భర్త తప్పు చేసినట్లయితే, ఆమె ఆయనను వదిలేస్తానని ప్రకటించారు.
జానీ మాస్టర్ ప్రతిభను ప్రోత్సహించేవారు మాత్రమే, ఇబ్బంది పెట్టేవారు కాదని ఆమె అన్నారు.
ఒక అమ్మాయికి అవకాశం లేకుండా ఆయన ఎందుకు చేస్తారన్నారని ప్రశ్నించారు.