Page Loader
Jani master: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన జానీ మాస్ట‌ర్.. ఆ సమయంలో ఆ ఇద్దరు గుర్తుకు వచ్చారు 
అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన జానీ మాస్ట‌ర్

Jani master: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన జానీ మాస్ట‌ర్.. ఆ సమయంలో ఆ ఇద్దరు గుర్తుకు వచ్చారు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్,లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి అనంతరం బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ సినిమాల షూటింగ్‌ల్లో చేరబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆయన ఇప్పటికే తన డాన్స్ అకాడమీలో ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. అయితే,తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో,అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై ఆయన స్పందించారు. "అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం నాకు తెలియగానే,నా మనసులో మొదటగా గుర్తొచ్చింది ఆయన పిల్లలు.ఎందుకంటే,అల్లు అర్జున్ పిల్లలను నాకు బాగా తెలుసు.వారు షూటింగ్‌కు వస్తారు, అల్లరి చేస్తారు.కానీ వారి తండ్రి అరెస్ట్ అయినప్పుడు వాళ్లు ఎలా ఫీల్ అవుతారో అనిపించింది.నేను కూడా జైలుకు వెళ్లినప్పుడు నా ఇద్దరు పిల్లలు ఎలా ఉంటారో అని ఎంతో ఆందోళనపడ్డాను,"అని జానీ మాస్టర్ చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై స్పందించిన జానీ