Jio Hotstar Censor: ఓటీటీ ప్రేక్షకులకు ఊహించని షాక్.. జియోహాట్‌స్టార్ లోని అంతర్జాతీయ కంటెంట్‌ను సెన్సార్ చేయాలని నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటివరకు సెన్సార్ లేకుండా వీక్షిస్తున్న వెబ్ సిరీస్‌లు, సినిమాలు భవిష్యత్తులో అందుబాటులో చూడలేకపోవచ్చు.
ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ హాట్ స్టార్, జియో సినిమా విలీనం చెంది జియోహాట్‌స్టార్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే, ఈ కొత్త ప్లాట్‌ఫాం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇకపై అంతర్జాతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు భారతీయ కంటెంట్‌కు కూడా సెన్సార్ నిబంధనలు వర్తించనున్నట్లు తెలుస్తోంది.
భారత ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సెన్సార్ షిప్ విధించనున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత
ఇప్పటికే జియోలో అందుబాటులో ఉన్న హెబీవో, పీకాక్, హూలు కంటెంట్‌కు సెన్సార్ అమలు చేయబడిందని సమాచారం.
గతంలో హెబీవో కంటెంట్ జియోలో ఉచితంగా అందుబాటులో ఉండగా, ఇప్పుడు అయితే హెబీవో వెబ్ సిరీస్‌లు పూర్తిగా కనిపించకపోవడంతో ఓటీటీ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా హెబీవోలో విడుదలైన "ది వైట్ లోటస్" (సీజన్ 3) వెబ్ సిరీస్ జియోలో సెన్సార్ చేయబడిందని వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.సెన్సార్‌షిప్ కారణంగా ప్రేక్షకుల స్వేచ్ఛకు పరిమితులు విధిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇకపై సెన్సార్ లేని ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులకు నిరాశ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.