
War 2 : వార్ 2 కొత్త ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్,బీటౌన్ స్టార్ హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా 'వార్ 2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. టీజర్, ట్రైలర్ విడుదలతోనే ఈ సినిమా పట్ల భారీ ఉత్సాహం సృష్టించిన మేకర్స్, ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 14న భారీ ఆశల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో, ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో 'వార్ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా, ఇప్పటికే బుక్ మై షోలో 'వార్ 2'కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఎన్టీఆర్ ఒక ఆసక్తికరమైన వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
Are you ready to witness the CARNAGE in cinemas from August 14th?
— Yash Raj Films (@yrf) August 10, 2025
BOOK TICKETS NOW for #War2 and let us give you an experience to cherish for the rest of your lives 🔥🔥
Releasing in Hindi, Telugu & Tamil in theatres worldwide!https://t.co/DsRnq2pO7e | https://t.co/7d0OKxPVEg pic.twitter.com/yMHVyuAgXu