Page Loader
Devara Collections: 'దేవర' మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

Devara Collections: 'దేవర' మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 04, 2024
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన దేవర చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం అభిమానుల అంచనాలను ఏమాత్రం తగ్గకుండా భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దేవర చిత్రంలో ఎన్టీఆర్ మాస్ డైలాగ్స్, యాక్టింగ్, సైఫ్ అలీఖాన్‌ విలనిజం, యాక్షన్ సీన్స్, ఫాదర్ సెంటిమెంట్ వంటి అంశాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాతో మొదటి రోజే రూ.173 కోట్లు (గ్రాస్) భారీ ఓపెనింగ్స్ సాధించడంలో విజయం సాధించింది.

వివరాలు 

ఈ చిత్రం రూ.600 కోట్ల (గ్రాస్) మార్క్ చేరుకునే అవకాశాలు

ఇటీవలే చిత్ర యూనిట్ దేవర చిత్రం మొదటి వారానికి సంబంధించిన కలెక్షన్ వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.405 కోట్లు (గ్రాస్) వసూళ్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ కలెక్షన్లతో తారక్ కెరీర్‌లో సోలో పెర్ఫార్మెన్స్‌కి సంబంధించిన హైయెస్ట్ వసూళ్ల చిత్రంగా దేవర రికార్డు సాధించింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం దసరా సెలవులు మరియు పెద్ద చిత్రాల విడుదలల లేకపోవడం వల్ల ఈ వారాంతంలో దేవర కలెక్షన్లు మరింత పెరగనున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ చిత్రం రూ.600 కోట్ల (గ్రాస్) మార్క్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్టీఆర్ ఆర్ట్స్ చేసిన ట్వీట్