Devara OTT: ఆ పండగ రోజున.. ఓటీటీలోకి ఎన్టీఆర్ 'దేవర'..
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం దేవర. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలై, అభిమానుల భారీ అంచనాల మధ్య మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ పొందింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ, టాలీవుడ్ ఇండస్ట్రీలోని అనేక రికార్డులను తిరగరాస్తోంది. ప్రస్తుతం, ఇది 500 కోట్ల మైలురాయికి దగ్గరలో ఉంది.
దేవర స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ కొనుగోలు
ఈ సినిమా గురించి ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం, దేవర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. దీనికి 150 కోట్ల రూపాయల చెల్లింపు జరిగింది. ఇంకా, థియేట్రికల్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత మాత్రమే దేవర ఓటీటీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.