LOADING...
Trivikram-NTR-Allu Arjun : త్రివిక్రమ్ మైథలాజికల్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్… నాగవంశీ ట్వీట్ తో క్లారిటీ..
త్రివిక్రమ్ మైథలాజికల్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్… నాగవంశీ ట్వీట్ తో క్లారిటీ..

Trivikram-NTR-Allu Arjun : త్రివిక్రమ్ మైథలాజికల్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్… నాగవంశీ ట్వీట్ తో క్లారిటీ..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఒక పవర్‌ఫుల్ పౌరాణిక సినిమా రూపొందనుండగా, అనూహ్యంగా పరిస్థితులు మారినట్టు తెలుస్తోంది. మొదట త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌ను బన్నీతో చేసే ఆలోచనలో ఉన్నప్పటికీ, అల్లు అర్జున్ ప్రస్తుతానికి డైరెక్టర్ అట్లీ సినిమాపై దృష్టి పెట్టాడు. దాంతో త్రివిక్రమ్ కొంత కాలం బన్నీ కోసం వెయిట్ చేసినప్పటికీ, స్పష్టత రాకపోవడంతో కొత్త దారిలో అడుగులు వేశాడు. సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ ఇప్పుడు ఇదే పౌరాణిక కథను జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. వాస్తవానికి ఈ కథను మొదటినుంచి తారక్‌ కోసం సిద్ధం చేసినట్టు నిర్మాత సూర్యదేవర నాగవంశీ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వివరాలు 

మోస్ట్ ఫేవరెట్ అన్న మోస్ట్ పవర్‌ఫుల్ గాడ్‌గా కనిపించనున్నారు

ఇది చిన్న సినిమా కాదు.. ఓ ఇంటర్నేషనల్ లెవెల్ మైథలాజికల్ ప్రాజెక్ట్ అనే టాక్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. కథలో ప్రధాన పాత్రగా కుమారస్వామి ఉంటాడనే వార్తలు కూడా ఇప్పుడు బలపడుతున్నాయి. ఇటీవల నాగవంశీ తన ఎక్స్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. "మోస్ట్ ఫేవరెట్ అన్న మోస్ట్ పవర్‌ఫుల్ గాడ్‌గా కనిపించనున్నారు" అంటూ ఒక మిస్టీరియస్ పోస్టు చేయడం, ఆ వెంటనే కుమారస్వామిపై ఒక శ్లోకాన్ని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్‌దే అని కన్ఫర్మ్ అయిపోయింది.

వివరాలు 

కుమారస్వామిగా జూనియర్ ఎన్టీఆర్

త్రివిక్రమ్‌కు పురాణాల్లో దాగి ఉన్న మానవీయతను ఆధారంగా చేసుకుని కథలు చెప్పడంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న విషయం తెలిసిందే. ఈసారి కుమారస్వామి ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని ఓ గొప్ప విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా ఈ సినిమాను రూపొందించాలనే యోచనలో ఉన్నారు. విజువల్స్, గ్రాఫిక్స్, ప్రొడక్షన్ డిజైన్ ఇలా అన్నింటినీ గ్లోబల్ స్టాండర్డ్‌లో ఉంచాలనే ప్లాన్ చేస్తున్నారట. ఇంకా, పౌరాణిక పాత్రలు పోషించడంలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ గతంలో 'యమదొంగ' చిత్రంలో యముడిగా అలరించగా, ఇప్పుడు కుమారస్వామిగా కనిపించి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయనున్నాడని టాక్.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాగ వంశి చేసిన ట్వీట్