
Jr NTR: నటుడిగా కంటే నిజాయతీ గల వ్యక్తిగా తనను గుర్తించాలన్న తారక్
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా హిట్‌గా నిలిచిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తన మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించుకున్న జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు బాలీవుడ్‌లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన నటించిన హిందీ చిత్రం 'వార్ 2' ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తారక్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినిమా రంగంలో కుటుంబ వారసత్వం ఎలా ముందుకు సాగుతుందన్న విషయం తనకు స్పష్టంగా తెలియదని ఆయన పేర్కొన్నారు. అలాగే, తాను ముందుగానే ఏవైనా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టూ లేదని చెప్పారు. అయితే, తాను నటిస్తున్న చిత్రాల ద్వారానే ప్రజలు తనను గుర్తించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నానని వివరించారు.
వివరాలు
భావోద్వేగాలతో కూడిన నిజమైన మనిషిగా గుర్తిస్తే చాలు: ఎన్టీఆర్
ఒక నటుడిగా కంటే ముందు, నిజాయితీ గల వ్యక్తిగా తనను గుర్తించాలని తాను కోరుకుంటున్నట్టు తారక్ స్పష్టం చేశారు. భావోద్వేగాలతో కూడిన నిజమైన మనిషిగా తనను గుర్తిస్తే చాలని అన్నారు.