Loading...
Jyothika : స్నేహం నుంచి ప్రేమ వరకు... జ్యోతిక-సూర్య ప్రయాణం
స్నేహం నుంచి ప్రేమ వరకు... జ్యోతిక-సూర్య ప్రయాణం

Jyothika : స్నేహం నుంచి ప్రేమ వరకు... జ్యోతిక-సూర్య ప్రయాణం

వ్రాసిన వారు Moogati Shabari
Jun 07, 2026
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

సహజమైన నటనతో పాటు మహిళా ప్రాధాన్య కథలకు ప్రాధాన్యం ఇచ్చే నటిగా జ్యోతిక ప్రత్యేక గుర్తింపు పొందింది. క్రమశిక్షణతో కూడిన వ్యాయామాల వల్ల నలభై ఏళ్ల వయసు దాటినా చురుకుగా, ఆరోగ్యంగా కనిపిస్తూ వరుస అవకాశాలను అందుకుంటోంది. ఇటీవల విడుదలైన 'సిస్టమ్' సినిమాలో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతిక, తన వ్యక్తిగత, సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

వివరాలు

'వాలి'తో వచ్చిన గుర్తింపు..

నేను ముంబయిలో జన్మించి అక్కడే పెరిగాను. సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశాను.

మా నాన్న చందర్ సాధనా నిర్మాత కావడంతో హిందీ చిత్రసీమలో నాకు తొలి అవకాశం సులభంగా లభించింది.

అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదే సమయంలో చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా, సూర్య హీరోగా నటిస్తున్న ఒక తమిళ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్నాను.

అయితే ఆ సినిమా విడుదలకంటే ముందే అజిత్‌తో కలిసి నటించిన 'వాలి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం నాకు తొలి విజయాన్ని అందించడమే కాకుండా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది.

'ఠాగూర్' సినిమా ఘనవిజయం సాధించడంతో తెలుగులోనూ వరుస అవకాశాలు వచ్చాయి.

వివరాలు

కలిసి చేసిన ఏడు చిత్రాలు..

సూర్యను నేను తొలిసారి సినిమా సెట్లోనే కలిశాను. అప్పట్లో నాకు తమిళ భాష తెలియకపోవడంతో, ప్రతి సంభాషణ అర్థమయ్యేలా ఆయన ఎంతో ఓర్పుతో వివరించేవారు.

ముఖ్యంగా మహిళల పట్ల ఆయన చూపించే గౌరవం నాకు ఎంతో నచ్చింది.

అలా మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తరువాత మేమిద్దరం కలిసి మొత్తం ఏడు సినిమాల్లో నటించాం.

ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. మా ప్రేమ విషయం మొదట సూర్య తండ్రి, ప్రముఖ నటుడు శివకుమార్‌ గారికి చెప్పినప్పుడు ఆయన వెంటనే అంగీకరించలేదు.

అయితే నన్నే వివాహం చేసుకుంటానని, లేదంటే జీవితాంతం ఒంటరిగానే ఉంటానని సూర్య తన నిర్ణయంపై నిలబడటంతో, చివరకు ఆయన మా ప్రేమను అర్థం చేసుకుని అంగీకరించారు.

ADVERTISEMENT

వివరాలు

ఇద్దరికీ నచ్చే విషయాలు ఇవేే..

ప్రస్తుతం సినిమాల పనులు, పిల్లల చదువుల కారణంగా నేను ముంబయిలో ఉంటున్నాను.

సూర్య మాత్రం ముంబయి, చెన్నై నగరాల మధ్య తరచూ ప్రయాణాలు చేస్తుంటారు.

ప్రతి నెలా దాదాపు పది రోజుల పాటు షూటింగ్‌లకు విరామం ఇచ్చి పూర్తిగా కుటుంబంతోనే గడుపుతారు.

మా ఇద్దరికీ ముంబయి వీధి ఆహారం చాలా ఇష్టం. కుటుంబ సభ్యులందరం కలిసి తరచూ విహారయాత్రలకు వెళ్తుంటాం.

విదేశీ ప్రాంతాల్లో అయితే చాలామంది మమ్మల్ని గుర్తుపట్టరు. అందుకే సాధారణ వ్యక్తుల్లా షాపింగ్‌కు వెళ్లి ధరల విషయంలో బేరసారాలు కూడా చేస్తుంటాం.

ADVERTISEMENT

వివరాలు

ఇంట్లో నియమాలు పెట్టేది ఎవరంటే..

సూర్య, నేను ఇద్దరం ఇంటి గడప దాటిన తర్వాత మాత్రమే స్టార్‌డమ్‌ను గుర్తు చేసుకుంటాం.

ఇంట్లో మాత్రం మా కుమారుడు దేవ్‌, కుమార్తె దియాలకు సాధారణ తల్లిదండ్రుల్లాగే ఉంటాం.

పిల్లల పెంపకం బాధ్యతను ఇద్దరం సమానంగా పంచుకుంటాం. అయితే చదువు, మార్కులు, క్రమశిక్షణ వంటి అంశాల్లో నేను కొంత కఠినంగా వ్యవహరిస్తాను.

జీవితంలో చదువే అన్నీ కాదనే భావనతో పిల్లలకు ఇతర రంగాల్లో కూడా ప్రోత్సాహం అందించాం.

అందుకే బ్యాడ్మింటన్‌, కరాటే, పియానో, నృత్యం వంటి విభిన్న అంశాల్లో వారికి శిక్షణ ఇప్పించాం.

ADVERTISEMENT