ఆర్ఆర్ఆర్ సినిమాపై తమ్మారెడ్డి భరధ్వాజ్ వ్యాఖ్యలకు రాఘవేంద్రరావు కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రపంచమే దాసోహమైపోతోంది. కాకపోతే కొంతమంది సీనియర్ దర్శకులు మాత్రం, ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ పెడుతున్న ఖర్చుతో 8సినిమాలు తీయొచ్చంటూ ఉపదేశాలు చేస్తున్నారు.
రెండురోజుల క్రితం దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ చేసిన ఇలాంటి కామెంట్స్, సినిమా అభిమానులకు కోపం తెప్పించాయి. దాంతో తమ్మారెడ్డి భరధ్వాజ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన చిత్రంగా గర్వించాల్సింది పోయి ఇలాంటి ఏడుపు ఎందుకంటూ తమ్మారెడ్డి భరధ్వాజ కామెంట్లను దుయ్యబడుతున్నారు.
సినిమా అభిమానులే కాదు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా తమ్మారెడ్డి భరధ్వాజ కామెంట్లపై తీవ్రంగా స్పందించారు. ఆస్కార్ కి వెళ్తున్న సినిమా గురించి గర్వపడాల్సింది పోయి ఇలాంటి మాటలేంటని అన్నారు.
ఆర్ఆర్ఆర్
హాలీవుడ్ సెలెబ్రిటీలు ఆర్ఆర్ఆర్ కోసం డబ్బులు తీసుకున్నారా?
రాఘవేంద్రరావు ట్వీట్ చేస్తూ, మిత్రుడ్ భరధ్వాజ్ కి, తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు, ప్రపంచ వేదిక మీద మొదటిసారి వస్తున్న పేరును చూసి గర్వపడాలి. అంతేకానీ 80కోట్లు ఖర్చు పెట్టారని చెప్పడానికి నీ దగ్గర అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా?
జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశ్యమా? అని అన్నారు.
ఈ విషయమై ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలైంది. తెలుగు సినిమా అందలం ఎక్కుతుంటే పెద్దవాళ్ళు సీనియర్లు అయిన వాళ్లే ఇలా కడుపు మంట పెట్టుకోవడం ఏంటని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.