కాజల్ కొడుకు నీల్ కిచ్లు ఫస్ట్ బర్త్ డే.. ఫోటోలు వైరల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొడుకు నీల్ కిచ్లు జన్మించి నేటితో ఏడాది పూర్తియైంది. దీంతో నీల్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్టార్ హీరోలు, హీరోయిన్లు స్పందిస్తూ స్టార్ కిడ్ నీల్ కిచ్లుకు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. కాజల్ అగర్వాల్ తన కొడుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పసుపు చొక్కా తొడిగిన నీల్.. తోట మధ్యలో ఒక బాక్స్ లో చిరునవ్వుతో ఉన్న ఫోటోను కాజల్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోకి తెగ లైకులు, కామెంట్లు వస్తున్నాయి. 2020 అక్టోబర్ 30న ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ అగర్వాల్ కి వివాహమైంది.
విషెష్ తెలిపిన స్టార్ హీరోయిన్లు
ఫోటోను చూసిన రకుల్ ప్రీతిసింగ్ ఓమైగాడ్ వాట్ ఏ క్యూటీ అంటూ పోస్టు చేసింది. నటి లక్ష్మి మంచు స్పందిస్తూ అతను నిన్న పుట్టాడు.. అప్పడు సంవత్సరం అయ్యిందా? నీల్ పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొంది. నటీనటులు నేహా ధూపియా, హన్సిక మోత్వాని కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కాజల్, కమలహసన్ తో కలిసి భారతీయుడు-2 సినిమాలో నటిస్తోంది.అలాగే బాలయ్య సరసన NBK108లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాజల్ చేతిలో బోలెడు సినిమాలున్నాయి.