Kalki 2898 AD : వరుసగా ఆరో రోజు అదే జోరు.. తగ్గని 'కల్కి 2898 AD' మానియా
ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ నటించిన చిత్రం కల్కి 2898 AD. జూలై 1, సోమవారం నాడు, అంతకుముందు రోజు కలెక్షన్లతో పోలిస్తే 60.77 శాతం తగ్గుదల చూపింది. ఇండస్ట్రీ ట్రాకర్ Sacnilk ప్రకారం, ఇది థియేటర్లలో ఆరో రోజు బాక్స్ ఆఫీస్ వద్ద నికరంగా 27.95 కోట్లు వసూలు చేసింది. టాలీవుడ్ (తెలుగు చిత్ర పరిశ్రమ)లో కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ నటించిన కల్కి 2898 AD జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భారతీయ తొలి భారీ బడ్జెట్ మూవీకి భారీగానే వసూళ్లు
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆరు రోజుల రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా 625 కోట్ల నికర వసూలు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఒకటిగా పేర్కొన్నారు. ఈ సినిమా బడ్జెట్ మొత్తం 600 కోట్లు . వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ మొదటి శనివారం 66.2 కోట్లు , ఆదివారం 88.2 కోట్ల నికర వసూలు చేసింది.
రాష్ట్రాల వారీగా వసూళ్ల వివరాలు
వారాంతపు వసూళ్లు నికరంగా 154.4 కోట్లు వసూలు చేసింది.Kalki 2898AD బాక్స్ ఆఫీసు వద్ద బుధవారానికి 625 కోట్ల గ్రాస్ దాటిందని అని ట్రేడ్ వర్గాల సమాచారం. సోమవారం నాటి నుంచి 60 శాతం కలెక్షన్లు తగ్గినప్పటికీ బాగానే వసూళ్లను రాబడుతోంది. ఆరో రోజున 27.95 కోట్లు రాబట్టింది. రాష్ట్రాల వారీగా చూస్తే తెలుగు (11.2 కోట్లు) ,తమిళనాడు (1.2 కోట్లు), హిందీ (14 కోట్లు) ,కన్నడ (0.25కోట్లు) ,మలయాళం (1.2 కోట్లు) గా వుంది.
800 కోట్ల వసూళ్లను రాబట్టే తొలి చిత్రంగా Kalki
గడిచిన ఆరు నెలలుగా సరైన భారీ బడ్జెట్ సినిమాలు లేకపోవటంతో దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమలో మునుపటి ఉత్సాహం కరవైంది. మళ్లీ Kalki 2898 ADతో సినీ ధియేటర్లలో సందడి నెలకొంది. కాగా ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఒక్క ప్రభాస్ సినిమానే 800 కోట్ల వసూళ్లను రాబట్టే తొలి చిత్రంగా నిలవనుంది.