Kalki 2898 AD: ప్రభాస్ 'కల్కి 2898 AD' నుండి హై స్పీడ్ లో దూసుకొచ్చిన బుజ్జి.. గ్లింప్స్ చూశారా.?
ప్రభాస్ నటించిన కల్కి 2898 AD రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది.ఏది ఏమైనా మేకర్స్ ప్రేక్షకులకు రోజుకో సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు. బుధవారం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈవెంట్ లో కల్కి 2898 AD సినిమాలోని కొత్త పాత్ర బుజ్జిని ప్రకటించారు. సినిమాలో బుజ్జి క్యారెక్టర్ రాగానే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది.భైరవ(ప్రభాస్ పాత్ర పేరు) నడిపే వెహికల్ బుజ్జికి సంబంధించిన గ్లింప్స్ ని నిన్న రాత్రి రిలీజ్ చేసారు. భవిష్యత్ వాహనం మానవ శరీరం వలె మెదడు ద్వారా ఎలా నియంత్రించబడుతుందో వీడియో చూపిస్తుంది. ప్రభాస్ కల్కి 2898 ADలో బుజ్జి రోబోటిక్ కారు. దీని పూర్తి నియంత్రణ భైరవ చేతిలో ఉంది.దీనిని భైరవుడు తయారు చేశాడు.
బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్
స్క్రాచ్ ఎపిసోడ్ 04 పేరుతో ఒక ప్రిల్యూడ్ ఎపిసోడ్‌ను కల్కి 2898 AD నిర్మాతలు మే 18న సాయంత్రం 5 గంటలకు ఆవిష్కరించారు. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ అందించారు. ప్రభాస్ బుజ్జితో మాట్లాడే మాటలు అలరిస్తున్నాయి. యాక్షన్ ఎలిమెంట్స్ చూస్తుంటే, ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఫుల్ ట్రీట్ లా అనిపిస్తుంది. ఒక్క చిన్న వీడియోలోనే మేకర్స్ ఈ రేంజ్ విజువల్స్ ను చూపించారు అంటే, ఫుల్ మూవీ ఇక ఎలా ఉండబోతుంది అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈసినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.