Page Loader
Kalki 2898 AD OTT: ఓటిటిలో 'కల్కి 2898 ఏడీ' సరికొత్త రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో ఉందంటే!
ఓటిటిలో 'కల్కి 2898 ఏడీ' సరికొత్త రికార్డు

Kalki 2898 AD OTT: ఓటిటిలో 'కల్కి 2898 ఏడీ' సరికొత్త రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో ఉందంటే!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2024
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

థియేటర్‌లో,ఓటీటీలోనూ ప్రభాస్‌ నటించిన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) భారీ సంచలనం సృష్టిస్తోంది. జూన్‌లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికలలో ప్రసారం అవుతోంది.అమెజాన్‌, నెట్‌ ఫ్లిక్స్‌లలో స్ట్రీమింగ్‌ అయ్యే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఆగస్టు 22న నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత,ఇది అత్యధిక వ్యూస్‌తో టాప్‌ ప్లేస్ లో నిలుచుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వ్యూస్‌ను సాధించిన ఈ చిత్రం, గ్లోబల్‌ ట్రెండింగ్‌లో మొదటిస్థానంలో నిలిచింది.రెండు వారాల్లో 7.1 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

వివరాలు 

సీక్వెల్‌పై తాజాగా నిర్మాతల అప్‌డేట్‌

మొదటివారంలోనే 2.6 మిలియన్ల వ్యూస్‌ నమోదు చేయడం విశేషం. ప్రస్తుతం, ఈ చిత్రం నాన్‌ ఇంగ్లిష్‌ విభాగంలో నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ వన్‌గా నిలుస్తోంది. సైన్స్‌ ఫిక్షన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కల్కి' సుమారు రూ.1200 కోట్ల కలెక్షన్లు సాధించింది. అమితాబ్ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె నటించిన ఈ సినిమాకి సీక్వెల్‌ కూడా 4 నెలల్లో ప్రారంభం కానుంది. సీక్వెల్‌పై తాజాగా నిర్మాతలు అప్‌డేట్‌ ఇచ్చారు.సీక్వెల్‌ షూటింగ్‌ మొదటిభాగం చిత్రీకరణ సమయంలోనే కొంతమేర పూర్తి చేశారు. కానీ కొన్ని కీలక సన్నివేశాలు, వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇంకా పూర్తిచేయాల్సి ఉంది.