
Bharateeyudu 2:'ఇండియన్ 2' మొదటి సింగిల్ విడుదలకు టైం ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "ఇండియన్ 2 ".స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
గతంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచిన"ఇండియన్" సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.
అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదొక అడ్డంకి వస్తూనే ఉంది.అయితే ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ ను దర్శకుడు శంకర్ పూర్తి చేసారు.
భారతీయుడు 2 సినిమా జులై 12న తెలుగు,తమిళ,హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్,సిద్దార్థ్,రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
అలాగే బాబీ సింహా,ఎస్ జె సూర్య వంటి తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈసినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Details
ఫస్ట్ సింగిల్‌కు మేకర్స్ ముహూర్తం
మేకర్స్ ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ మొదలెట్టింది. జూన్ 1న చెన్నైలో ఈ చిత్ర పాటల వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపింది.
కాగా, భారతీయుడు 2 ఫస్ట్ సింగిల్‌కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.
'సౌరా' ప్రోమో ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల అవుతుందని, పూర్తి పాట రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లైకా ప్రొడక్షన్స్ చేసిన ట్వీట్
Get ready for a Promo of the 1st single "SOURAA" 🔪 from BHARATEEYUDU-2 🇮🇳 releasing today at 5️⃣ PM! Full Song dropping tomorrow at 5️⃣ PM!
— Lyca Productions (@LycaProductions) May 21, 2024
Rockstar @anirudhofficial musical 🎹
Lyrics #SuddalaAshokTeja ✍🏻#Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @anirudhofficial… pic.twitter.com/JQtx2BRIoQ