
కమల్ హాసన్ తో నటించిన మరుగుజ్జు మోహన్ మృతి: పేదరికం వల్ల రోడ్డు మీదే కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
కమల్ హాసన్ నటించిన విచిత్ర సోదరులు సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో మరుగుజ్జుగా కమల్ హాసన్ నటించాడు.
అయితే కమల్ హాసన్ స్నేహితులుగా నటించిన మరుగుజ్జు మోహన్ కన్నుమూసారు. మధురై రోడ్ల మీద మోహన్ శవమై కనిపించారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతకొన్ని రోజులుగా మధురై రోడ్ల మీద భిక్షాటన చేస్తున్న మోహన్, ఆరోగ్యం బాగోలేక రోడ్డుమీదే మరణించారు.
యుక్త వయసులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మోహన్, విచిత్ర సోదరులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసారు.
Details
నేనే దేవుణ్ణి సినిమాలో మోహన్
మోహన్ చివరగా నటించిన చిత్రం నేనే దేవుణ్ణి. ఆర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా, 2009లో విడుదలైంది.
నేనే దేవుణ్ణి తర్వాత సొంతూరుకు వెళ్ళిపోయిన మోహన్, తర్వాత కొన్నిరోజులకు సినిమా అవకాశాల కోసం ఊరును విడిచి వచ్చారట.
అయితే సినిమాల్లో ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక, అటు ఊరికి కూడా వెళ్ళలేక భిక్షాటన చేస్తూ జీవనాన్ని సాగిస్తూ వచ్చాడని సమాచారం.
చివరకు నిన్న సాయంత్రం మధురై రోడ్డు మీద శవంలా కనిపించారు. 60ఏళ్ల వయసులో తినడానికి తిండిలేక దయనీయమైన స్థితిలో మోహన్ మరణించారు.