Page Loader
Official: కమల్ హాసన్ థగ్ లైఫ్ షూటింగ్ ప్రారంభం 
Official: కమల్ హాసన్ థగ్ లైఫ్ షూటింగ్ ప్రారంభం

Official: కమల్ హాసన్ థగ్ లైఫ్ షూటింగ్ ప్రారంభం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2024
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

'నాయకుడు'(1987)వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో కమల్‌ హాసన్,దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'థగ్‌ లైఫ్‌'. ఇక ఈ చిత్రం పై మేకర్స్ ఇప్పుడు మరో సాలిడ్ అప్డేట్ ని అందించారు. ఈరోజు నుండి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టుగా Day 1 shoot అంటూ మేకర్స్ అనౌన్సమెంట్ చేశారు. అంతేకాకుండా,ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులపై ఇంట్రెస్టింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ నటిస్తోంది. జయం రవి, ఐశ్వర్య లక్ష్మి,గౌతం కార్తీక్,జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్,అభిరామి, నాజర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని ఆర్. మహేంద్రన్, శివ అనంత్‌ నిర్మిస్తున్నారు.ఈ భారీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ చిత్రానికి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 మేకర్స్ చేసిన ట్వీట్