
Kamal Haasan-Rajinikanth: 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన కమల్-రజనీ.. మల్టీస్టారర్‌కి అధికారికంగా గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
సినీప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ కాంబినేషన్ ఇప్పుడు అధికారికమైంది. ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులైన కమల్ హాసన్, రజనీకాంత్‌లు (Rajinikanth) 46 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే తెరపై కనిపించబోతున్నారు. కొద్ది రోజులుగా వీరి మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గురించి ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తకు బిగ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది కమల్ హాసన్ స్వయంగా దీంతో అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్ నెలకొంది. ఇటీవల జరిగిన సైమా అవార్డుల కార్యక్రమంలో కమల్ హాసన్ (Kamal Haasan) ఈ విషయాన్ని వెల్లడించారు. 'మీరు, రజనీకాంత్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందా?' అని వ్యాఖ్యాత అడగగా ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
Details
లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసే అవకాశం
'ప్రేక్షకులు మా కాంబినేషన్‌ను ఇష్టపడితే అదే మాకు సంతోషం. మేమిద్దరం కలిసి నటించాలని ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్నాం. కానీ ఇంతకాలం కుదరలేదు. ఇప్పుడు త్వరలోనే మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేయబోతున్నాంటూ స్పష్టంచేశారు.దీంతో ఈ బిగ్ మల్టీస్టారర్ ఖాయం అయ్యింది. అయితే సినిమా గురించి మరిన్ని డీటైల్స్ మాత్రం కమల్ రివీల్ చేయలేదు. ఇక కమల్, రజనీ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తోన్న రూమర్స్‌పై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.'మా మధ్య ఎలాంటి భేదాలు లేవు. ఇవన్నీ మీరు ఊహించుకున్నవే. మేమెప్పుడూ ఒకరికి ఒకరం పోటీగా భావించలేదు. ఒకరి సినిమాలు మరొకరం నిర్మించాలనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని కమల్ చెప్పారు. అదే సమయంలో ఈ ప్రాజెక్ట్‌ను లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తారనే బజ్ కోలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది.
Details
ఐదు భాషల్లో 20పైగా సినిమాలు
ఆయన గ్యాంగ్‌స్టర్ డ్రామాను తెరకెక్కించనుండగా, కమల్, రజనీ ఇద్దరూ అందులో గ్యాంగ్‌స్టర్లుగా సందడి చేయనున్నారని సమాచారం. ఇదే నిజమైతే 46 ఏళ్ల తర్వాత ఈ లెజెండరీ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే — 1970వ దశకంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఐదు భాషల్లో 20కి పైగా సినిమాలు చేశారు. కానీ ఆ తర్వాత వీరు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాలేదు. ఇన్నేళ్లకు లోకేశ్ రాసిన కథలో వీరిద్దరూ కలసి నటించనున్నారని టాక్. దీంతో సినీప్రియులు ఈ కాంబినేషన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.