Page Loader
Kangana Ranaut: కంగనా రనౌత్ ఎమోషనల్ పోస్ట్.. ఇంట్లో తీవ్ర విషాదం 
కంగనా రనౌత్ ఎమోషనల్ పోస్ట్.. ఇంట్లో తీవ్ర విషాదం

Kangana Ranaut: కంగనా రనౌత్ ఎమోషనల్ పోస్ట్.. ఇంట్లో తీవ్ర విషాదం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కంగనా అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ మరణించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వెల్లడించింది. నవంబర్ 8న, శుక్రవారం రాత్రి తన అమ్మమ్మ మరణించినట్లు ఆమె శనివారం వెల్లడించారు. కొంతకాలం క్రితం ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నారని తెలిపారు. కంగనా తన మొదటి పోస్ట్‌లో అమ్మమ్మతో కలిసి ఉన్న ఒక ఆనందకరమైన ఫోటోను షేర్ చేశారు. నిన్న రాత్రి తన అమ్మమ్మ మరణించిందని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని పేర్కొంది.

Details

బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి

తన అమ్మమ్మకు ఐదుగురు పిల్లలున్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా పిల్లల అందరికీ ఉన్నత విద్యను అందించడానికి తీవ్రంగా శ్రమించారు. పెళ్లయిన తరువాత కూడా తమ స్వంత వృత్తిలో నిలబడాలని కుమార్తెలను ప్రోత్సహించారు. ఆమె కుమార్తెలకు ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. ఈ మధ్య బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆమె మరణించినట్లు కంగనా తెలిపింది.