LOADING...
Kannappa OTT Release: ఓటీటీలో ఆలస్యంగా స్ట్రీమింగ్ అయిన 'కన్నప్ప' సినిమా
ఓటీటీలో ఆలస్యంగా స్ట్రీమింగ్ అయిన 'కన్నప్ప' సినిమా

Kannappa OTT Release: ఓటీటీలో ఆలస్యంగా స్ట్రీమింగ్ అయిన 'కన్నప్ప' సినిమా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన 'కన్నప్ప' చిత్రం ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే, చిన్న ట్విస్ట్ కారణంగా నెటిజన్లు కొద్దిసేపు అయోమయం చెందారు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ పాన్-ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే,బాక్సాఫీస్ వద్ద అంచనాలంత విజయాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ, భారీ తారాగణం,అద్భుతమైన మేకింగ్ విజువల్స్ కారణంగా,ఓటీటీలో సినిమా మంచి క్రేజ్ సాధించింది. మంచు విష్ణు స్వయంగా సోషల్ మీడియాలో సెప్టెంబర్ 4నుంచి 'కన్నప్ప' అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. కానీ,నిర్ణీత సమయానికి స్ట్రీమింగ్ ప్రారంభం కాకపోవడంతో,నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

వివరాలు 

అమెజాన్ ప్రైమ్ టీమ్ అధికారిక పోస్టర్ విడుదలతో స్పష్టత

"సినిమాకు ఏదైనా సమస్య ఉందా?" అనే ప్రశ్నలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. చివరకు అమెజాన్ ప్రైమ్ టీమ్ అధికారిక పోస్టర్ విడుదల చేయడంతో స్పష్టత వచ్చింది. కొద్దిసేపు ఆలస్యమైనప్పటికీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో, మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటించగా, ప్రభాస్ రుద్ర పాత్ర,మోహన్‌లాల్ కిరాత పాత్ర,అక్షయ్ కుమార్ శివుడి పాత్ర,కాజల్ అగర్వాల్ పార్వతి పాత్రలో కనిపించారు.

వివరాలు 

ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు నిర్మించారు

మోహన్ బాబు ప్రత్యేక పాత్రలో మహదేవశాస్త్రి గా ఆకట్టుకున్నారు. దాదాపు పదేళ్లుగా విష్ణు కలలుగన్నఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు నిర్మించారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలస్యంగా అయినా స్ట్రీమింగ్ ప్రారంభమవ్వడంతో.. సినిమా చూడాలని ఎదురుచూసిన ప్రేక్షకులు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఎంజాయ్ చేయనున్నారు. చూడాలిమరి ఓటీటీలో ప్రేక్షకులను ఎంతవరకు కన్నప్ప అలరించగలడో.