Page Loader
Kantara Chapter 1 : 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

Kantara Chapter 1 : 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2023
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిషబ్ శెట్టి నటించిన 'కాంతార' సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ముందుగా కన్నడలో బ్లాక్ బాస్టర్ కాగా, ఆ తర్వాత తెలుగు, హిందీ సహా మరిన్ని బాషల్లో డబ్ అయి బంపర్ హిట్ అయింది. భారీ కలెక్షన్లతో పాటు ప్రశంసలను కూడా దక్కించుకుంది. ఈ సినిమాతో కన్నడ పరిశ్రమ వైపు దేశమంతా చూసింది. తాజాగా కాంతార సినిమాకు ప్రిక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' వస్తోంది. 'కాంతారా-ఏ లెజెండార్ చాప్టర్ 1' కు చిత్రానికి సంబంధించిన ఇవాళ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో రిషబ్ శెట్టి కండలు తిరిగిన దేహంతో గెటప్ చాలా కొత్తగా ఉంది.

Details

కదంబల కాలంలో జన్మించిన ఓ లెజెండ్ కథగా 'కాంతార చాప్టర్ 1'

దేహమంతా రక్తపు మరకలు, మెడలో రుద్రాక్షలు, చేతిలో త్రిశూలం, పొడువు జుట్టు, గడ్డంతో రిషబ్ లుక్ బీభత్సంగా ఉంది. కదంబల కాలంలో జన్మించిన ఓ లెజెండ్ కథగా ఫస్ట్ లుక్ టీజర్స్ లో మేకర్స్ పేర్కొన్నారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ బాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక వచ్చే ఏడాది ఈ చిత్రం థియోటర్లలో విడుదల కానుంది.