Kanya Kumari: కన్యా కుమారి టీజర్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ
ఈ వార్తాకథనం ఏంటి
ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన 'పుష్పక విమానం' సినిమాతో దర్శకుడు దామోదర మంచి తెచ్చుకున్నారు.
ప్రస్తుతం దామోదర రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాతగా "కన్యాకుమారి"సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకొని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
కన్యాకుమారి టీజర్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు.ఈ సందర్భంగా టీజర్ చాలా బాగుందని,"కన్యాకుమారి" మూవీ టీమ్ కు తన బెస్ట్ విషెస్ ని తెలియజేశారు విజయ్ దేవరకొండ .
Details
ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న శ్రీచరణ్ రాచకొండ
ఇక ట్రైలర్ విషయానికి వస్తే కన్యాకుమారి అనే శ్రీకాకుళం అమ్మాయి క్యారెక్టర్ లో గీత్ సైని అద్భుతంగా ఉంది.
ఈ సినిమా తో శ్రీచరణ్ రాచకొండ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.
"పుష్పక విమానం" దర్శకుడు దామోదర తన సెకండ్ ప్రాజెక్ట్ తో మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించినట్లు టీజర్ తో తెలుస్తోంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాక , "కన్యాకుమారి" విడుదల తేదీని మూవీ టీమ్ అనౌన్స్ చేయనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీజర్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ
Meet Ms #Kanyakumari from Srikakulam...
— Vijay Deverakonda (@TheDeverakonda) January 9, 2024
Launching Kanya Kumari teaser - https://t.co/Qf9HoHkID1
All The Best kanyakumari Team!@itsdamodara@geethsaini@sreecharan_r@theradicalpic@nagarjut@gskmedia_PR