
జపాన్ ఇంట్రో వీడియో: మేడిన్ ఇండియా అంటూ విలక్షణంగా కనిపించిన కార్తీ
ఈ వార్తాకథనం ఏంటి
వైవిధ్యమైన సినిమాలు చేయడంలోనూ, విలక్షణ పాత్రలు చేయడంలోనూ ఆసక్తి కనబరిచే కార్తీ, జపాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుండి కార్తీ లుక్ రిలీజైంది.
కార్తీ బర్త్ డే సందర్భంగా, జపాన్ మూవీ నుండి ఇంట్రో వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా రిలీజైన ఈ ఇంట్రో వీడియోలో కొత్త గెటప్ లో కనిపించాడు కార్తీ.
జపాన్ అనే పేరుతో ఇండియాలో తయారైనట్టుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు కార్తీ.
జపాన్ పాత్ర గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా అనుకుంటున్నట్టు ఇంట్రో వీడియోలో చూపించారు. ఒకరేమో కామెడీ టైప్ అనీ, మరొకరేమో విలన్ టైప్ అనీ, రకరకాలుగా జపాన్ గురించి మాట్లాడుకోవడం చూపించారు.
Details
చిత్ర విచిత్రమైన గెటప్ లో కార్తీ
మొత్తానికి కార్తీ చేస్తున్న జపాన్ పాత్ర, ఎలా ఉంటుందో ఒక క్లారిటీ ఇవ్వకుండా చిత్ర విచిత్రంగా ఉంటుందని తెలియజేసాడు. కార్తీ గెటప్ కూడా అందుకు తగినట్టుగానే ఉంది.
జపాన్ చిత్రంలో కార్తీ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. తెలుగు నటుడు సునీల్, దర్శకుడు విజయ్ మిల్టన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు తెరకెక్కిస్తున్నారు.
తెలుగు, తమిళం, కన్నడ, మళయలం భాషల్లో జపాన్ ఇంట్రో విడుదలైంది. దీపావళి కానుకనా జపాన్ సినిమాను దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఇటీవల కార్తీ నటించిన పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం థియేటర్లలో రిలీజై, ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జపాన్ మూవీ ఇంట్రో వీడియో
Here’s the Intro of #Japan
— Vijay Deverakonda (@TheDeverakonda) May 25, 2023
Very Happy to share the Japan Intro with you all on his birthday ❤
Happy Birthday @Karthi_Offl anna 🤗
🔗 https://t.co/HdEG1NMA7h#HappyBirthdayKarthi #JapanFromDiwali @ItsAnuEmmanuel #Sunil @vijaymilton @gvprakash @dop_ravivarman @philoedit… pic.twitter.com/qGASlCu8MZ