LOADING...
Chiru-Karthik: హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో మెప్పించిన కార్తీక్.. ఇప్పుడు చిరు సినిమాలో క్రేజీ ఆఫర్ 
హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో మెప్పించిన కార్తీక్.. ఇప్పుడు చిరు సినిమాలో క్రేజీ ఆఫర్

Chiru-Karthik: హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో మెప్పించిన కార్తీక్.. ఇప్పుడు చిరు సినిమాలో క్రేజీ ఆఫర్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2025
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

'మిరాయ్' సినిమాతో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని యావత్‌ సినీ ఇండస్ట్రీని షేక్ చేశాడు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌ని సొంతం చేసుకుంది. విడుదలైన తొలి రోజే రూ.27 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టగా, కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ.55 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విజయానికి ప్రధాన కారణం దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనని చెప్పుకోవాలి. తాను ఊహించిన కథనాన్ని అత్యుత్తమ క్వాలిటీతో స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసి సూపర్ సక్సెస్ అయ్యాడు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అందించి ఇండియా లెవల్లో ప్రశంసలు అందుకున్నాడు.

Details

చిరుతో కలిసి పనిచేసే అవకాశం

ఇక 'మిరాయ్'లో కార్తీక్ ఘట్టమనేని కేవలం దర్శకుడిగానే కాక, సినిమాటోగ్రాఫర్‌గానూ పని చేశాడు. తన అద్భుతమైన కెమెరా వర్క్‌తో సినిమాను నెక్స్ట్ లెవెల్‌లో ప్రెజెంట్ చేశాడు. ఆయన పనితనానికి ఇండస్ట్రీలో వందకు వెయ్యి ప్రశంసలు అందాయి. ఇంతకుముందు కూడా ఆయన అనేక సినిమాలకు కెమెరామెన్‌గా వర్క్ చేశారు. అయితే ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేనికి బంపర్ ఆఫర్ దక్కింది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి వర్క్ చేసే అవకాశం. ఇప్పటికే చిరంజీవి-బాబీ కొల్లి కాంబినేషన్‌లో 'వాల్తేరు వీరయ్య' వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

Details

సినిమాటోగ్రాఫర్‌గా ఛాన్స్

ఇప్పుడు మరోసారి ఈ కాంబో కలిసి ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా కార్తీక్ ఘట్టమనేనిని ఫిక్స్ చేసినట్లు సమాచారం. బాబీ కొల్లి అనుకున్న విజన్‌ను నిజం చేయగల వ్యక్తి కార్తీక్ అని భావించి ఈ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నాడు ఈ యువ దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.