Kasthuri: తెలుగువారిపై 'కస్తూరి' వ్యాఖ్యలు.. 4 సెక్షన్ల కింద కేసు నమోదు
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటీమణులలో ఒకరిగా పేరొందిన కస్తూరి, ఇటీవల తెలుగువారిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పెద్ద దుమారాన్ని రేపింది. దీనిపై విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో, ఆమెపై చెన్నై ఎగ్మూర్ పోలీస్ స్టేషన్‌లో 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 4న చెన్నైలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కస్తూరి తెలుగువారు రాజ మహిళలకు సేవ చేయటానికి అంతఃపురంలో వచ్చారని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ఆగౌరపరిచేలా ఉన్నాయంటూ పలువురి నుంచి వ్యతిరేకత వచ్చింది. దీనిపై కస్తూరి స్పందించింది.
డీఎంకే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోంది
డీఎంకే తనకు వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని, తాను తెలుగుకు వ్యతిరేకం అని తప్పు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. తాను తమిలుల మధ్య ద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నామని ఆరోపించడం, బ్రాహ్మణ కమ్యూనిటీపై చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పారు. చెన్నైలో బ్రాహ్మణ సంఘం వారు పరువుకు భంగం కలిగించే చర్యలను ఖండిస్తూ నిరసన తెలిపారు. దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టే చట్టంలా, బ్రాహ్మణ వర్గాలకు రక్షణ కల్పించేలా కొత్త చట్టాలు తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.