Dilruba: కిరణ్ అబ్బవరం 'దిల్ రూబా' నుంచి కేసీపీడీ లిరికల్ వీడియో వచ్చేసింది..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం 'దిల్ రూబా'. విశ్వ కరుణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
అందాల భామ రుక్సర్ ధిల్లాన్ ఇందులో కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ సంగీత సంస్థ సారెగమ తన నిర్మాణ సంస్థ అయిన ఏ యూడ్లీ ఫిల్మ్‌తో కలిసి నిర్మిస్తున్నాయి.
ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది.
వివరాలు
మార్చి 11న ప్రీ-రిలీజ్ ఈవెంట్
ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే మూడు పాటలు విడుదల కాగా, తాజాగా నాలుగో పాట 'కేసీపీడీ'ను విడుదల చేశారు.
అలాగే, ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మార్చి 11న హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభమవుతుందని చిత్రబృందం ప్రకటించింది.