Keerthy Suresh: లేడీ డాన్ అవతారంలో కీర్తి సురేష్.. 'అక్క' టీజర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
మార్పు అనేది సహజం, అందుకే పెద్దలు ఉరికే అనలేదు. చాలా మంది హీరోయిన్లు కెరీర్‌లో అవకాశాల కోసం మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు.
అయితే కొంతమంది నటీమణులలో వచ్చిన మార్పులు చూసే వారికి కాస్త ఆశ్చర్యం కలిగిస్తాయి. ప్రస్తుతానికి కీర్తి సురేష్ విషయంలో ఇదే జరిగింది.
ఇంతకాలం వరకు క్యూట్ రోల్స్ మాత్రమే చేసిన ఈ ముద్దుగుమ్మ, కెరీర్ ప్రారంభ దశలోనూ అలాంటి పాత్రలకే పరిమితమైంది.
కానీ 'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ స్థాయిలో పెరుగుదల వచ్చి, ఆమెకు పెర్ఫార్మెన్స్ ప్రధానమైన పాత్రలు వరుసగా వచ్చాయి.
కానీ ఇప్పుడు కీర్తి పూర్తిగా మారిపోయింది. గ్లామర్ షోతో ఫుల్ ఫ్లెజ్‌డ్‌గా దూసుకుపోతోంది.
Details
పవర్ ఫుల్ రోల్ లో కనిపించిన కీర్తి సురేష్
రీసెంట్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ తొలిసారి పూర్తిగా భిన్నమైన పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుంది.
'అక్క' అనే వెబ్ సిరీస్‌లో ఆమె లీడ్ రోల్ పోషిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.
ఇది సాధారణమైన హిందీ సినిమా తరహా కంటెంట్ కాదని, ఈ ప్రాజెక్ట్ కోసం బోలెడంత కసరత్తు చేశారని తెలుస్తోంది.
దర్శకుడు ధర్మ రాజ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌లో కీర్తి సురేష్ 'పెర్నూరు' అనే ఫిక్షనల్ ప్రాంతానికి చెందిన లేడీ డాన్ పాత్రలో కనిపించనుంది.
Details
కీలక పాత్రలో నటించనున్న రాధిక ఆప్టే
ఈ కథనాన్ని వినగానే ఆదిత్య చోప్రా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కీర్తి సురేష్ ఈ ప్రాజెక్ట్‌ను 'బేబీ జాన్' మూవీ కంటే ముందే సైన్ చేసింది.
ఇందులో మరో కీలక పాత్రలో రాధిక ఆప్టే కూడా నటించింది.
టీజర్‌లో చూపించిన దృశ్యాలు కేవలం టేస్టర్స్ మాత్రమేనని, అసలు కంటెంట్ మాత్రం చాలా షాకింగ్‌గా ఉంటుందని టాక్.
'అక్క' ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందనే విషయం స్పష్టత రాలేకపోయినా ఈ వెబ్ సిరీస్ ఓ పెద్ద సంచలనం సృష్టించడం మాత్రం ఖాయమని అర్థమవుతోంది.