
Kenishaa: జయం రవితో రిలేషన్.. గాయని కెనీషాకు హత్య బెదిరింపులు
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ నటుడు జయం రవి (అసలు పేరు రవి మోహన్) గాయని కెనీషాతో సంబంధం ఉందని చాలాకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా గాయని కెనీషా చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
గుర్తు తెలియని వ్యక్తుల నుండి తనకు హత్యకు సంబంధించిన బెదిరింపులు వస్తున్నాయని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఇలాంటి బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను పంచుకుంటూ, తన భావోద్వేగాలను వివరించారు.
వివరాలు
''తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను''
తనపై వస్తున్న విమర్శలపై కెనీషా స్పందిస్తూ, ''నేను కామెంట్లు ఆఫ్ చేయలేదు. ఎక్కడికీ పారిపోలేదు. నా గురించి మీ అందరి ముందే ఉన్నాను. మీకు నన్ను ప్రశ్నించే హక్కు ఉంది. కానీ, ఏదైనా చెప్పాలంటే నా ముఖం ఎదుటే చెప్పండి. నా వైపు నుండి నిజాలు చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా చుట్టూ జరిగే ఘటనలకు నేను బాధ్యురాలిని అనుకుంటే.. నన్ను కోర్టులో నిలబెట్టండి'' అంటూ స్పష్టం చేశారు.
వివరాలు
గవంతుడు త్వరలోనే నిజాన్ని బయటపెడతాడు
''మీ శాపనార్థాలు,గాయపరిచే పదాలు నాకు చాలా బాధను కలిగిస్తున్నాయి. ఇది మీలో ఎవరైనా ఆలోచించారా? మీరు అంటున్నట్టు కర్మ ప్రతి ఒక్కరిని వదిలిపెట్టదు, కానీ నిజం బయటకు వచ్చిన తర్వాత మీరంతా ఎలా ఫీలవుతారో కూడా ఆలోచించండి. నన్ను విమర్శిస్తున్నవారిలో చాలామందికి వాస్తవాలు తెలియకపోవచ్చు. అయినప్పటికీ, మీ మాటలు నా మనసుకు బాగా బాధను కలిగిస్తున్నాయి. మీ బాధను నేను అర్థం చేసుకుంటున్నా. కానీ భగవంతుడు త్వరలోనే నిజాన్ని బయటపెడతాడని ఆశిస్తున్నాను. నేను తప్పు చేస్తే చట్టం విధించే శిక్షను స్వీకరించేందుకు సిద్ధమే. కానీ అప్పటివరకు నన్ను ద్వేషించకండి. ప్రశాంతంగా జీవించనివ్వండి'' అని ఆమె రాసుకొచ్చారు..
వివరాలు
జయం రవి-ఆర్తి విడాకులపై చర్చలు: మూడో వ్యక్తి కారణమేనా?
ఇకపోతే జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
అయితే ఆ విషయాన్ని తనకు ముందుగా తెలియజేయకుండానే రవి ప్రకటించారని, ఆ వార్తలతో తాను షాక్‌కి గురయ్యానని ఆర్తి పేర్కొన్నారు.
ఇకపోతే రవి, కెనీషా మధ్య స్నేహం ఉందని, అందుకే భార్యకు విడాకులు ఇస్తున్నారని కోలీవుడ్‌లో పలు వార్తలు వెలువడుతున్నాయి.
తాము విడిపోయే దానికి మూడో వ్యక్తి ముఖ్య కారణమని, దీనికి సంబంధించి తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఇటీవల ఆర్తి మీడియాతో అన్నారు.
ఈ నేపథ్యంలో జయం రవి - కెనీషా సంబంధం, ఆర్తి చేసిన ఆరోపణలు కలసి తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.