ఖుషి షూటింగ్ పూర్తి; చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఖుషి' షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ తాజా అప్‌డేట్ ఇచ్చింది. షూట్ పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందంతో కలిసి విజయ్ కేక్ కట్ చేశాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నట్లు సంస్థ వెల్లడించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహాబ్ స్వరాలను సమకూర్చుతున్నారు. రొమాంటిక్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 2 పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సెప్టెంబర్ 1న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.