LOADING...
kidambi srikanth - Shravya Varma : ఆర్జీవీ మేన‌కోడ‌లితో కిదాంబి శ్రీకాంత్ వివాహం
ఆర్జీవీ మేన‌కోడ‌లితో కిదాంబి శ్రీకాంత్ వివాహం

kidambi srikanth - Shravya Varma : ఆర్జీవీ మేన‌కోడ‌లితో కిదాంబి శ్రీకాంత్ వివాహం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2024
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్ వ‌ర్మ మేన‌కోడ‌లు, టాలీవుడ్ సెల‌బ్రిటీ ఫ్యాష‌న్ డిజైన‌ర్ శ్రావ్య వ‌ర్మ, బ్యాడ్మింట‌న్ స్టార్ కిదాంబి శ్రీకాంత్‌ల పెళ్లి హైద‌రాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఘ‌నంగా జ‌రిగింది. కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, పలువురు టాలీవుడ్ సెల‌బ్రిటీల‌ సమక్షంలో ఈ జంట ఒక్క‌టైంది. పెళ్లి వేడుకలో ద‌ర్శ‌కులు నాగ్ అశ్విన్‌, వంశీ పైడిప‌ల్లి, హీరో విజయ్ దేవరకొండ‌, హీరోయిన్ ర‌ష్మిక, కీర్తి సురేశ్‌ హజరై కొత్త జంట‌ను ఆశీర్వదించారు. శ్రావ్య వ‌ర్మ పేరు టాలీవుడ్‌లో సుప‌రిచితమే. ఆమె స్టైలిస్ట్‌గా అనేక స్టార్స్‌కు పని చేసింది.

Details

 టాలీవుడ్‌లో స‌క్సెస్‌ఫుల్ ఫ్యాషన్ డిజైన‌ర్‌గా శ్రావ్య

ర‌ష్మిక కథానాయికగా నటిస్తున్న 'ది గర్ల్‌ఫ్రెండ్‌' మూవీలో శ్రావ్య డిజైనర్‌గా పని చేస్తోంద‌ని తెలుస్తోంది. శ్రావ్య వర్మ, కిదాంబి శ్రీకాంత్‌ కొన్నాళ్ల పాటు ప్రేమించారు. ఆగ‌స్టులో పెద్దల సమక్షంలో నిశిత్తార్థం చేసుకుని, ఇప్పుడు వివాహం చేసుకున్నారు. శ్రావ్య వర్మ ఇప్ప‌టికీ టాలీవుడ్‌లో స‌క్సెస్‌ఫుల్ ఫ్యాషన్ డిజైన‌ర్‌గా ప్రసిద్ధి చెందారు.