Page Loader
ధనుష్ పాన్ ఇండియా ప్రాజెక్టులో కింగ్ నాగార్జున: అధికారికంగా ప్రకటించిన మేకర్స్ 
ధనుష్, శేఖర్ కమ్ముల కాంబో సినిమాలో కింగ్ నాగార్జున

ధనుష్ పాన్ ఇండియా ప్రాజెక్టులో కింగ్ నాగార్జున: అధికారికంగా ప్రకటించిన మేకర్స్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 29, 2023
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ నటుడు ధనుష్, 'సార్' సినిమాతో తెలుగులోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. D51 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో కింగ్ నాగార్జునను తీసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా ప్రాజెక్టు కోసం పవర్ హౌస్ లాంటి నటుడు కావాలని నాగార్జున కంటే మించిన పవర్ హౌస్ మరేమి ఉంటుందని తెలుపుతూ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్