LOADING...
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం 'కె-ర్యాంప్' నుంచి తొలి పాట 'ఓనం' రిలీజ్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం 'కె-ర్యాంప్' నుంచి తొలి పాట 'ఓనం' రిలీజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కె-ర్యాంప్'. యాక్షన్ కామెడీ శైలిలో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి,మేకర్స్ శనివారం తొలి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 'ఓనం సాంగ్' అనే పేరుతో విడుదలైన ఈ లిరికల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ,పండగ వాతావరణాన్ని నింపుతోంది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరాలు అందించి,గాయని సాహితీ చాగంటితో కలిసి ఆలపించారు. సురేంద్ర కృష్ణ రాసిన సాహిత్యం ఈ పాటలో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఈ పాట విడుదల సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

వివరాలు 

కిరణ్ కెరీర్‌లో పూర్తి స్థాయి కామెడీ రోల్ 

"ఈ పాట చిత్రీకరణ నిజమైన పండగలా అనిపించింది. మేం ఎంతగా ఎంజాయ్ చేశామో, మీరందరూ కూడా ఈ పాటను అంతే సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నా" అని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది కిరణ్ కెరీర్‌లో పూర్తి స్థాయి కామెడీ రోల్ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. హాస్యమూవీస్ పతాకంపై రాజేష్ దండా,శివ బమ్మాక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సతీష్ రెడ్డి మాసం ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు,కాగా చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న థియేటర్లలో'కె-ర్యాంప్'విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హీరో కిరణ్ అబ్బవరం చేసిన ట్వీట్