Kiran: కిరణ్ అబ్బవరం 'దిల్ రూబ' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరానికి 2023లో బాగా కలుసొచ్చింది. ప్రేమించిన రహస్య గోరక్‌ను వివాహం చేసుకోవడం, 'క' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడం వంటి ఆనందకర ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ విజయాలతో ఆయన కెరీర్ మంచి మోమెంటమ్‌లోకి వచ్చింది. ఈ ఏడాదిని కూడా అదే పాజిటివిటీతో మొదలుపెట్టాలని కిరణ్ అబ్బవరం సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం 'దిల్ రూబ' అనే కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో రుక్సర్ దిల్లోన్ హీరోయిన్‌గా నటించగా, సంగీతాన్ని సామ్ సి.ఎస్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తయి, సినిమా రిలీజ్‌కి సిద్దంగా ఉంది.
Details
మార్చి 14న రిలీజ్
ఇంతలోనే విడుదల తేదీపై కొత్త సమాచారం హల్‌చల్ చేస్తోంది.
ముందుగా ఈ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు రిలీజ్ వాయిదా పడింది.
దీంతో ప్రేక్షకులు కొత్త విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేగాక, తాజా సమాచారం ప్రకారం 'దిల్ రూబ' మార్చి 14న థియేటర్లలోకి రావచ్చని తెలుస్తోంది.
అయితే, దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అభిమానులు కిరణ్ అబ్బవరం నుంచి మరో హిట్ ఎప్పుడొస్తుందో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.