Page Loader
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నూతన చిత్రం 'కే-ర్యాంప్‌' లాంఛనంగా ప్రారంభం
కిరణ్ అబ్బవరం నూతన చిత్రం 'కే-ర్యాంప్‌' లాంఛనంగా ప్రారంభం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నూతన చిత్రం 'కే-ర్యాంప్‌' లాంఛనంగా ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2025
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

'క' చిత్రంతో ఘన విజయాన్ని సాధించిన నటుడు కిరణ్ అబ్బవరం, మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, జైన్స్ నానీ దర్శకత్వంలో, రాజేశ్ దండ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు 'కే-ర్యాంప్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై, హీరో-హీరోయిన్లపై క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. మరో ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్‌ ఆన్ చేశారు. కేరళ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో యుక్తి హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటుడు నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.