Loading...
Korean Kanakaraju: సైలెంట్‌గా రూ.50 కోట్లు కొట్టేసిన 'కొరియన్‌ కనకరాజు'.. వరుణ్‌ తేజ్‌ కమ్‌బ్యాక్‌ అదుర్స్‌!
సైలెంట్‌గా రూ.50 కోట్లు కొట్టేసిన 'కొరియన్‌ కనకరాజు'.. వరుణ్‌ తేజ్‌ కమ్‌బ్యాక్‌ అదుర్స్‌!

Korean Kanakaraju: సైలెంట్‌గా రూ.50 కోట్లు కొట్టేసిన 'కొరియన్‌ కనకరాజు'.. వరుణ్‌ తేజ్‌ కమ్‌బ్యాక్‌ అదుర్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2026
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైనర్‌ 'కొరియన్‌ కనకరాజు'(#KOKA) బాక్సాఫీస్‌ వద్ద అదరగొడుతోంది. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలిరోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుని థియేటర్లలో దూసుకుపోతోంది. ఈ సినిమాకు రూ.12 కోట్ల బ్రేక్‌ఈవెన్‌ టార్గెట్‌తో బరిలోకి దిగగా.. కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50.30 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఈ వసూళ్లు ట్రేడ్‌ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. సినిమా విజయంతో నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, క్యాంటీన్‌ ఓనర్ల వరకు ప్రతి ఒక్కరికీ లాభాలు అందుతున్నాయి. దీంతో ఈ చిత్రం అన్ని వర్గాలకూ టేబుల్‌ ప్రాఫిట్స్‌ అందిస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది.

వివరాలు

వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో బెస్ట్‌ కమ్‌బ్యాక్‌ మూవీ

వరుస సినిమాల తర్వాత వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో బెస్ట్‌ కమ్‌బ్యాక్‌ మూవీగా 'కొరియన్‌ కనకరాజు' నిలిచింది.

సినిమాలో ఆయన చూపించిన కామెడీ టైమింగ్‌, విభిన్నమైన కామెడీ యాంగిల్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

మేర్లపాక గాంధీ తనదైన మార్క్‌ కామెడీతో సినిమాను తెరకెక్కించగా.. ఎస్‌. తమన్‌ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చింది.

ఈ రెండు అంశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రేక్షకులు, ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 'కొరియన్‌ కనకరాజు' సాధిస్తున్న ఈ భారీ విజయంతో నిర్మాణ సంస్థల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది.

సినిమా ఇదే జోరును కొనసాగిస్తే మరింత భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ADVERTISEMENT