Page Loader
Kubera: ధనుష్ 'కుబేర్' కోసం బ్యాంకాక్‌లో నాగార్జున
Kubera: ధనుష్ 'కుబేర్' కోసం బ్యాంకాక్‌లో నాగార్జున

Kubera: ధనుష్ 'కుబేర్' కోసం బ్యాంకాక్‌లో నాగార్జున

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2024
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం తమిళ నటుడు ధనుష్, 'నా సామి రంగ' నటుడు అక్కినేని నాగార్జునతో 'కుబేర' అనే సినిమా చేస్తున్నాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ ప్రారంభమైందని సమాచారం. కొన్ని టాకీ, యాక్షన్ పార్ట్‌లను రూపొందించే షెడ్యూల్‌లో నాగార్జున, టీమ్‌లోని మరికొందరు నటీనటులు పాల్గొంటున్నారు. షూట్ అప్‌డేట్ ఇస్తూ, మేకర్స్ వర్కింగ్ స్టిల్ కూడా పెట్టారు.

Details 

'కుబేర' చిత్రాన్ని వివిధ బాషలలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ 

'కుబేర' చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్రానికి 'పుష్ప 2', 'కంగువ' స్వరకర్త దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. నికేత్ బొమ్మి ఫోటోగ్రఫీ డైరెక్టర్. 'రంగస్థలం' ఫేమ్ మోనికా నిగోత్రే కూడా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కలిసి 'కుబేర' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్