Loading...
Lalit Modi Sushmita Sen: ప్రియురాలికి లలత్‌మోడీ విషెష్‌...సోషల్‌ మీడియాలో వైరల్
ప్రియురాలికి లలత్‌మోడీ విషెష్‌...సోషల్‌ మీడియాలో వైరల్

Lalit Modi Sushmita Sen: ప్రియురాలికి లలత్‌మోడీ విషెష్‌...సోషల్‌ మీడియాలో వైరల్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 20, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌కు ఐపీఎల్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సుస్మితా సేన్ 51వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకప్పుడు సుస్మితను తన 'బెటర్ హాఫ్'గా పరిచయం చేసిన లలిత్ మోదీ.. ఈసారి మాత్రం ఆమెను 'ప్రియమైన స్నేహితురాలు'గా పేర్కొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. సుస్మితతో కలిసి దిగిన ఓ పాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేస్తూ.. "హ్యాపీ బర్త్‌డే మై ఫ్రెండ్" అంటూ విషెస్ చెప్పారు.

Details

ఒకప్పుడు 'బెటర్ హాఫ్' అంటూ పరిచయం

లలిత్ మోదీ, సుస్మితా సేన్ రిలేషన్‌షిప్ 2022లో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.

ఆ ఏడాది జులైలో మాల్దీవులు, సార్డీనియా వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను లలిత్ మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అప్పుడే సుస్మితను తన 'బెటర్ హాఫ్'గా పేర్కొంటూ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ప్రకటించారు.

దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే తాము కేవలం డేటింగ్‌లో ఉన్నామని, ఇంకా పెళ్లి చేసుకోలేదని లలిత్ మోదీ తర్వాత స్పష్టం చేశారు.

Details

కొద్ది నెలలకే ముగిసిన బంధం

అయితే ఈ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2022 సెప్టెంబర్‌లో లలిత్ మోదీ, సుస్మితా సేన్ విడిపోయారనే వార్తలు బయటకు వచ్చాయి.

దీనికి కారణంగా లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి సుస్మిత ఫొటోలను తొలగించడం, బయో నుంచి ఆమె పేరును తీసేయడం వంటి పరిణామాలు కనిపించాయి.

ఆ తర్వాత 2025 ఫిబ్రవరిలో రిమా బౌరీ అనే కొత్త భాగస్వామిని లలిత్ మోదీ పరిచయం చేశారు. తమ 25 ఏళ్ల స్నేహం ప్రేమగా మారిందని అప్పట్లో ఆయన వెల్లడించారు.

ADVERTISEMENT

Details

ఇప్పుడు మళ్లీ స్నేహితురాలిగా విషెస్

ఇక 2026 జూన్‌లో ఓ ఇంటర్వ్యూలో లలిత్ మోదీ సుస్మితతో విడిపోవడానికి భౌగోళిక దూరమే ప్రధాన కారణమని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె పుట్టినరోజు సందర్భంగా 'ప్రియమైన స్నేహితురాలు' అంటూ విషెస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

గతంలో ప్రేమగా చెప్పుకున్న వ్యక్తికి ఇప్పుడు స్నేహితురాలిగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

పాత ఫొటోతో లలిత్ మోదీ చేసిన ఈ చిన్న పోస్ట్.. వారి గత బంధాన్ని మరోసారి అభిమానుల ముందుకు తీసుకొచ్చింది.

ADVERTISEMENT