అశోక్ గల్లా నెక్స్ట్ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అశోక్ గల్లా, మొదటి చిత్రమైన హీరో తో సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా రెండవ సినిమా తెరకెక్కుతోంది. అశోక్ గల్లా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో పవర్ఫుల్ పర్సన్ గా కనిపించబోతున్న పాత్రను రేపు ఉదయం 10:35గంటలకు పరిచయం చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. అ!, కల్కి, జాంబిరెడ్డి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్న ఈ సినిమాను అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేస్తున్నారు.