Chiranjeevi : 'ఎక్కడ విన్నా నవ్వులే'.. 'కొరియన్ కనకరాజు'పై మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్
ఈ వార్తాకథనం ఏంటి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' నేడు (ఆగస్టు 7) ప్రేక్షకుల ముందుకొచ్చింది. రితిక నాయక్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా సినిమాలోని కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోందని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాలు
వరుణ్ తేజ్‌ను అభినందించిన చిరంజీవి
సినిమాకు వస్తున్న సానుకూల స్పందనపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వరుణ్ తేజ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
వివరాలు
ఎక్కడ విన్నా నవ్వులే
చిరంజీవి తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు: ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఎక్కడ విన్నా 'నవ్వులే నవ్వులు' అనే మాటే వినిపిస్తోంది.
ప్రియమైన వరుణ్ తేజ్.. ఈ విజయానికి నిజంగా నువ్వు అర్హుడివి. నీ కష్టం, నిబద్ధతకు తగిన ఫలితం దక్కింది. ఈ గొప్ప విజయాన్ని అందుకున్న చిత్రబృందానికి నా హృదయపూర్వక అభినందనలు. త్వరలోనే ఈ సినిమాను చూస్తాను.
ఈ చిత్రం మరింత పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు.
వివరాలు
మెగా అభిమానుల్లో ఆనందం
మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ ప్రశంసలతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న 'కొరియన్ కనకరాజు' సినిమాకు చిరంజీవి ట్వీట్ మరింత బూస్ట్ ఇచ్చిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిరు చేసిన స్పెషల్ ట్వీట్ ఇదే
Hearing wonderful reports about #KoreanKanakaraju.
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 7, 2026
Everywhere, it’s the same response… “Navvule Navvulu” 😄
Dear @IAmVarunTej, you truly deserve this success. Congratulations ❤️
Your hard work and sincerity have paid off.
My heartfelt regards to director @GandhiMerlapaka,… pic.twitter.com/PLCpyB6Wse