తదుపరి వార్తా కథనం

Lavanya Tripathi: ఇంటి పేరును మార్చేసిన లావణ్య త్రిపాఠి.. ఇక నుంచి ఏమని పిలవాలంటే..?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 21, 2023
06:03 pm
ఈ వార్తాకథనం ఏంటి
అందాల రాక్షసి ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi), టాలీవుడ్ తనకంటూ ఓ మార్కెట్‌ను ఏర్పరుచుకుంది.
మొదటి సినిమాతోనే పెద్ద ఎత్తున్న అభిమానులను సొంతం చేసుకున్న ఆమె అనంతరం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది.
ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ను పెళ్లి చేసుకొని మెగా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
అయితే వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తన ఇంటి పేరును కూడా మార్చుకుంది.
ఇప్పటివరకూ సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి ఉన్నటువంటి ఆమె పేరు పక్కన 'కొణిదెల' పేరును చేర్చుకున్నారు.
ఆమె కేవలం ఇంస్టాగ్రామ్ పేజ్‌లో మాత్రమే తన పేరును మార్చుకున్నారు.