Page Loader
Suriya 44: 'నీ ప్రేమ కోసం రౌడీయిజం వదిలేస్తున్నా'.. 'సూర్య 44' టీజర్ వచ్చేసింది

Suriya 44: 'నీ ప్రేమ కోసం రౌడీయిజం వదిలేస్తున్నా'.. 'సూర్య 44' టీజర్ వచ్చేసింది

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య ఇటీవల తన చిత్రం 'కంగువ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సూర్య అభిమానులను సైతం నిరాశపరిచింది. అంతే కాకుండా సూర్య సతీమణి జ్యోతిక కూడా ఈ సినిమా ఫస్టాఫ్‌ బాగా లేదని చెప్పింది. ఈ పరిస్థితుల్లో, సూర్య మళ్లీ సత్తా చాటేందుకు హిట్‌ డైరెక్టర్‌ కార్తిక్‌ సుబ్బరాజుతో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తయింది. నేడు క్రిస్మస్‌ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సూర్య, కార్తిక్‌ సుబ్బరాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'రెట్రో' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Details

తమిళ టీజర్ రిలీజ్

టీజర్‌ విషయంలో చూస్తే, హీరోయిన్‌ పూజా హెగ్డేతో సూర్య మాట్లాడుతున్న సీన్‌తో టీజర్‌ ప్రారంభమవుతుంది. "నీ ప్రేమ కోసం ఈ రౌడీయిజం వదిలేస్తున్నా, నాది స్వచ్ఛమైన ప్రేమ" అనే సూర్య చెప్పిన డైలాగ్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టీజర్‌లో యాక్షన్‌ సన్నివేశాలు, లవ్‌ స్టోరీని సమపాళ్లలో మిళితం చేసి రూపొందించారు. ప్రస్తుతం తమిళ టీజర్‌ను మాత్రమే విడుదల చేశారు. త్వరలోనే మిగతా భాషల్లోనూ టీజర్‌ విడుదల కానుంది. ఈ మూవీని 2025 వేసవిలో విడుదల చేయాలని చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.