
సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ప్రేక్షకులు అందులోనూ ముఖ్యంగా రెబెల్ స్టార్ ప్రభాస్ ఫాన్స్ ఎక్కువగా ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా "సాలార్". సినిమా బృందం కూడా ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉండడం అభిమానుల్లో ఇంకొంచెం ఆతృత పెంచుతుంది.
ఇప్పటికే కేజిఎఫ్ తో దక్షిణ సినీ పరిశ్రమను ఒక రేంజ్ లో నిలబెట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఫాన్స్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇందులో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏప్రిల్ లోపు షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉందంటున్న ప్రశాంత్ నీల్
#ShrutiHaasan completed her portion of work in #Salaar, and now #Prabhas plans to complete the entire project by April. All the tasks should be completed within the next 30 - 40 days, after i will focus on post-production work of #NTR31 the shoot of #NTR31 in same sets of salaar pic.twitter.com/QYxkIN4Uzg
— Prashant Neel (@Prashantneell) February 24, 2023
ప్రభాస్
ప్రతినాయకుడి పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్
ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటిస్తున్నారు. పుష్ప సినిమాతో మలయాళ నటులను ప్రతినాయకులుగా తీసుకునే ట్రెండ్ మొదలయ్యింది.
ఇప్పుడు తాజాగా ఈ సినిమా నిడివి 3 గంటలు ఉంటుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రశాంత్ నీల్, ప్రభాస్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక మొత్తం చూసి ఇంత నిడివి ఉంచడమా లేదా అనవసరమైన సన్నివేశాలను తొలగించడమా అనేది నిర్ణయిస్తారు.
అయితే నిడివి ఎక్కువ ఉన్న సినిమాలు దర్శకుడు ప్రశాంత్ కు కొత్తేమీ కాదు.