Page Loader
Leo English Version : ఓటిటిలోకి లియో ఇంగ్లీష్ వెర్ష‌న్ రిలీజ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే
లైవ్ స్టీమింగ్ ఎందులో అంటే

Leo English Version : ఓటిటిలోకి లియో ఇంగ్లీష్ వెర్ష‌న్ రిలీజ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 12, 2023
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ సూపర్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ లియో సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మేరకు తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ఇక‌పై ఇంగ్లీష్‌ వర్షన్ సినిమాని ఓటిటిలో చూడొచ్చు. మంగ‌ళ‌వారం లియో ఇంగ్లీష్ వెర్ష‌న్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. తొలుత ద‌క్షిణాది, హిందీ భాష‌ల‌తో పాటు ఇంగ్లీషలోనూ ఒకేసారి రిలీజ్ చేయాల‌ని నెట్‌ఫ్లిక్స్ భావించింది. కానీ ఇంగ్లీష్ వెర్ష‌న్ డ‌బ్బింగ్ ప‌నులు ఆల‌స్యమయ్యాయి. ఈ మేరకు ఓటిటి రిలీజ్ కాస్త వాయిదా ప‌డి నేడు విడుదలైంది. రెండు వారాలు ఆల‌స్యంగా మంగ‌ళ‌వారం ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను ఓటిటిలోకి విడుదలైంది. ఇక ఓవ‌ర్‌సీస్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల కోరిక మేరకు లియో సినిమా ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేసిన‌ట్లు స‌మాచారం.

details

లియోను అద్భుతంగా రూపొందించిన డైరెక్టర్ కనగరాజ్

ఓటిటి ఇంగ్లీష్‌లో కాంతార త‌ర్వాత రిలీజైన సినిమాగా లియో గుర్తింపు సాధించింది. కాంతార ఇంగ్లీష్ వెర్ష‌న్‌ సైతం నెట్‌ఫ్లిక్స్‌లోనే అందుబాటులో ఉండ‌టం కొసమెరుపు. లోకేష్ క‌న‌గరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లియో, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ. 600 కోట్ల వ‌ర‌కు వసూళ్లు రాబ‌ట్టగలిగింది. ఇక ద‌ళ‌ప‌తి విజ‌య్ కెరీర్‌లోనే అత్యంత క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో లియో చోటు సంపాదించింది. లియోలో హీరోయిన్‌గా త్రిష ఆడిపాడింది. సంజ‌య్ ద‌త్‌, అర్జున్ కీల‌క పాత్ర‌లు పోషించారు. హాలీవుడ్ మూవీ ఏ హిస్ట‌రీ ఆఫ్ వ‌యోలెన్స్ ఆధారంగా లియో తెర‌కెక్కిన‌ట్లు తెలుస్తోంది. విజ‌య్ హీరోయిజం, క్యారెక్ట‌రైజేష‌న్ బాగుంద‌ని కానీ క‌థ‌పై కొంత నెగెటివ్ టాక్‌ ప్రచారం జరిగింది. అయినప్పటికీ త‌మిళ,తెలుగులో భాక్సాఫీస్ వ‌ద్ద లియో కనకవర్షం కురిపించడం విశేషం.