అమెరికాలో లియో మూవీ రికార్డు: రిలీజ్ కు ముందే ఆ ఘనత సాధించిన మూవీ
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో మూవీపై అంచనాలు భారీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. లియో సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన లియో మూవీ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో అమెరికాలో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. విడుదలకు ముందే టికెట్ల అమ్మకాల్లో లియో మూవీ సరికొత్త సంచలనాన్ని సృష్టిస్తోంది. విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే అమెరికా బాక్సాఫీసు వద్ద లియో మూవీకి మిలియన్ డాలర్ కలెక్షన్లు వచ్చాయి.
మొదటి రోజే 110కోట్ల వసూళ్లు వచ్చే అవకాశం
సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో మిలియన్ డాలర్ మార్కును చేరుకోవడంతో లియో మూవీ మీద అభిమానులు ఎంతటి అంచనాలు ఉన్నాయో అర్థం అవుతోంది. ఈ లెక్కన చూసుకుంటే లియో సినిమా మొదటి రోజు వసూళ్లు క్రేజీగా ఉండబోతున్నాయని సమాచారం. ట్రేడ్ పండితుల సమాచారం మేరకు లియో సినిమాకు మొదటి రోజు 110కోట్ల వసూలు వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో 60కోట్ల వసూళ్ళు, ఓవర్సీస్ నుండి 50కోట్ల వసూళ్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం. దళపతి విజయ్ హీరోగా కనిపిస్తున్న లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.